MIM: ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌పై ఎంఐఎం వేటు.. పార్టీ నుంచి బహిష్కరణ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 29, 2026
01:44 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌పై పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు ఎంఐఎం జాయింట్ సెక్రటరీ ఎస్‌ఏ హుస్సేన్ అన్వర్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా మిర్జా రహ్మత్ బేగ్ తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేసి, ఆ రాజీనామా పత్రాన్ని శాసన మండలి చైర్మన్‌కు సమర్పించాలని పార్టీ ఆదేశించింది. నాలుగు రోజుల క్రితం అత్తాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళలతో మిర్జా రహ్మత్ బేగ్ అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి.
వివరాలు
రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం
అయితే, ఈ ఆరోపణలే పార్టీ తాజా నిర్ణయానికి కారణమని ఎంఐఎం అధికారికంగా వెల్లడించలేదు.
మిర్జా రహ్మత్ బేగ్‌పై పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.