తదుపరి వార్తా కథనం
Andhra Pradesh: అరకులోయలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 19, 2025
08:40 am
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని ఊటీగా పేరొందిన అరకులోయలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో, కొన్ని చోట్ల ఉదయం వేళ మంచు పొరలు కమ్ముకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. గురువారం డుంబ్రిగుడ ప్రాంతంలో అత్యల్పంగా 3.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయిందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి వెల్లడించారు. అదేవిధంగా జి. మాడుగులలో 4.1 డిగ్రీలు, హుకుంపేటలో 6.2 డిగ్రీలు నమోదయ్యాయి. ముంచంగిపుట్టు, పాడేరు ప్రాంతాల్లో 6.9 డిగ్రీలు, పెదబయలులో 7.1 డిగ్రీలు, చింతపల్లిలో 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆయన వివరించారు.