LOADING...
AP Assembly Budget Sessions: డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్‌
డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్‌

AP Assembly Budget Sessions: డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2025
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అనంతరం 2025-26 బడ్జెట్‌పై చర్చ జరుగనుంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధులు తదితర అంశాలపై సభలో చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంలో, రాష్ట్రంలోని స్కూళ్లలో ప్రహారీ గోడల నిర్మాణం, డీఎస్సీ నిర్వహణపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్‌ సమాధానం ఇచ్చారు. త్వరలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ప్రహారీల నిర్మాణానికి రూ. 3వేల కోట్లు అవసరమని పేర్కొన్నారు. అదేవిధంగా, అన్ని కాలేజీలు, స్కూళ్లలో 'ఈగల్‌' బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

వివరాలు 

ప్రతి పాఠశాలలో ఈగల్ టీంలు ఏర్పాటు 

స్కూల్ ప్రహారీ గోడలు: రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో ప్రహారీ గోడల నిర్మాణానికి దాదాపు రూ.3వేల కోట్లు అవసరమవుతాయని,ఈ ప్రాజెక్టును 'మనబడి-మనభవిష్యత్తు','ఉపాధి హామీ' పథకాల ద్వారా దశల వారీగా అమలు చేస్తామని వెల్లడించారు. మెగా డీఎస్సీ: త్వరలో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈగల్ టీమ్స్: డ్రగ్స్ నివారణకు ప్రభుత్వం 'డ్రగ్స్ వద్దు బ్రో' అనే ప్రత్యేక క్యాంపెయిన్ ప్రారంభించిందని,దీనిలో భాగంగా అన్ని పాఠశాలలు,కాలేజీల్లో 'ఈగల్‌' బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పేరెంట్-టీచర్ మీటింగ్: పాఠశాలల్లో మౌళిక సదుపాయాల మెరుగుదల కోసం పేరెంట్-టీచర్ మీటింగ్స్‌లో 'స్టార్ రేటింగ్' విధానాన్ని ప్రవేశపెడుతున్నామని వివరించారు.

వివరాలు 

రంపచోడవరం నియోజకవర్గ అభివృద్ధి: 

117 జీవో పై చర్చ: గత ప్రభుత్వంలోని 117 జీవో కారణంగా నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమయ్యారని, దీనికి ప్రత్యామ్నాయ జీవో రూపొందించేందుకు సభ్యులతో చర్చించాలని నిర్ణయించామని వెల్లడించారు. 80 పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కోసం నిధులు మంజూరు. సీసీటీవీలు, లైటింగ్ ఏర్పాటు. 'లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఆఫ్ ఏపీ' కింద సీఎస్ఆర్ నిధుల వినియోగం. డిప్యూటీ సీఎం మాదిరిగా సీఎస్ఆర్ నిధులను ఉపయోగా చేసుకుంటూ అభివృద్ధి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా, నాల్గవ ప్రశ్నను వైసీపీ సభ్యులు అడగగా, వారికి సమాధానం ఇవ్వాలని మంత్రి లోకేశ్ డిప్యూటీ స్పీకర్‌ను అభ్యర్థించారు. దీనిపై డిప్యూటీ స్పీకర్ టీవీ ద్వారా అయినా సభ్యులు సమాధానం తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.