Minister Srinivas Goud: తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఊరట
తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌కు ఊరట లభించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 2019లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో శ్రీనివాస్ గౌడ్ తప్పుడు వివరాలను సమర్పించారని రాఘవేంద్రరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను సుదీర్ఘంగా విచారించిన న్యాయస్థానం మంగళవారం తుది తీర్పును వెలవరించింది. హైకోర్టు తీర్పుతో శ్రీనివాస్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. కోర్టుతో తీర్పుతో ఊరట పొందిన శ్రీనివాస్ గౌడ్.. తాజాగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. తన ప్రచారంలో స్పీడు పెంచారు.