Page Loader
CM Chandrababu: పాలనలో వేగం పెంచడానికే మంత్రులకు ర్యాంకులు : సీఎం చంద్రబాబు
పాలనలో వేగం పెంచడానికే మంత్రులకు ర్యాంకులు : సీఎం చంద్రబాబు

CM Chandrababu: పాలనలో వేగం పెంచడానికే మంత్రులకు ర్యాంకులు : సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2025
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు చరిత్రాత్మక తీర్పుతో గెలిపించారని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు తొలి రోజు నుంచే శ్రమిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విధ్వంసమైన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం శాయశక్తులా కృషి చేస్తుందని పేర్కొన్నారు. టీమ్‌ వర్క్‌ ద్వారా మాత్రమే ఉత్తమ ఫలితాలు సాధ్యమని తాను విశ్వసిస్తానని చంద్రబాబు అన్నారు. మంత్రులకు ర్యాంకుల కేటాయింపు ఎవరినీ తగ్గించడానికి కాదని, పాలనలో వేగాన్ని పెంచేందుకు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేశారు.

Details

సంక్షేమం, అభివృద్ధి పథకాలు 

'పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి సంక్షేమ పథకాల అమలుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల సాధనకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 'సూపర్ సిక్స్' పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని, ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. సమష్టిగా పని చేసినప్పుడే మాత్రమే అత్యుత్తమ ఫలితాలు సాధించగలమని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

Details

 పునర్నిర్మాణ దిశగా వేగవంతమైన చర్యలు

అసాధారణంగా, వేగవంతమైన పాలన లేకుండా విధ్వంసాన్ని ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లలేమని, అందుకే ప్రతి ఒక్కరూ టీం స్పిరిట్‌తో పని చేయాలని సూచించారు. పనితీరు సమీక్షించుకుంటూ ముందుకు సాగాలన్నారు. మంత్రుల పనితీరును అంచనా వేసేందుకు ఫైళ్ల క్లియరెన్స్‌లో ర్యాంకులు కేటాయించామన్నారు. ఇది ఎవరినీ పెద్దగా చూపించడానికి లేదా తక్కువ చేయడానికి కాదన్నారు.

Details

 పీపుల్ ఫస్ట్' విధానం - సమష్టిగా కృషి 

ఫైళ్ల క్లియరెన్స్‌లో తాను కూడా తన పనితీరును మెరుగుపరుచుకోవాల్సి ఉందన్నారు. ప్రజలను ముందుగా గుర్తించే 'పీపుల్ ఫస్ట్' విధానంతో తాను, తన మంత్రివర్గం పనిచేస్తోందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. అంతా కలిసి పనిచేస్తేనే ప్రజల సమస్యలను పరిష్కరించగలమన్నారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో అత్యున్నత ప్రతిభను ప్రదర్శించాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.