
Sri Sathya Sai: పుట్టపర్తిలో అద్భుత దృశ్యం.. శ్రీ సత్యసాయి మెడలో నాగుపాము
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. విదేశీయురాలు ఇంటిలో సత్యసాయి బాబా పాలరాతి విగ్రహం మెడలో నాగుపాము ప్రత్యక్షమైంది.
విగ్రహానికి చుట్టుకున్న నాగుపామును చూసి భక్తులను ఆశ్చర్యపోయారు.
అమెరికాకు చెందిన ప్యాటీ కైన్ మెన్ అనే భక్తురాలు బ్రహ్మణపల్లి రహదారి సమీపంలో గల ఆర్గ్ సంగ్ విల్లాస్ గృహ సముదాయంలో నివాసముంటోంది.
మూడు నెలల క్రితం సత్య సాయిబాబా విగ్రహాలతో శ్రీ సత్యసాయి ఈశ్వర దత్త మందిరాన్ని ఆ ప్రాంతంలో నిర్మించింది.
ఆమె నిత్యం పూజలు చేస్తూ నైవేద్యం అందిస్తోంది.
Details
నాగుపాముకు పూజలు చేసిన భక్తులు
అందులో భాగంగా బుధవారం పూజలు చేద్దామని గుడి తలుపులు తెరిచి చూసిన ప్యాటీ ఆశ్చర్యపోయింది.
అక్కడ ఓ నాగుపాము సాయిబాబా పాతరాలి విగ్రహంపై ఉండటాన్ని గమనించింది.
ఇక బాబా మెడలో ఒదిగిపోయిన నాగుపామును చూసి ఆమె భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున్న అక్కడికి చేరుకున్నారు.
నాగుపాముకు పాలు తాపించి, పూజలు చేశారు. ఈ దృశ్యాన్ని చూడటానికి భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.