Loading...
Jammu Couple: రైలు ఆలస్యం.. విమానం మిస్.. జమ్మూ దంపతులకు రూ.63 వేల పరిహారం ఇవ్వాలని రైల్వేకు ఆదేశం
జమ్మూ దంపతులకు రూ.63 వేల పరిహారం ఇవ్వాలని రైల్వేకు ఆదేశం

Jammu Couple: రైలు ఆలస్యం.. విమానం మిస్.. జమ్మూ దంపతులకు రూ.63 వేల పరిహారం ఇవ్వాలని రైల్వేకు ఆదేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైలు ఆలస్యం కారణంగా విమానం మిస్ అయిన ఓ జమ్మూ దంపతులకు వినియోగదారుల ఫోరం ఊరటనిచ్చింది. రైల్వే శాఖ సేవల్లో లోపం ఉందని నిర్ధారించిన జమ్మూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. బాధితులకు రూ.63 వేలకు పైగా పరిహారం చెల్లించాలని ఉత్తర రైల్వే, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పొగమంచు కారణంగానే రైలు ఆలస్యమైందన్న రైల్వే శాఖ వాదనను కమిషన్ అంగీకరించలేదు.

వివరాలు 

అసలేం జరిగిందంటే?

జమ్మూకు చెందిన మోహిత్ సింగ్ భౌ, ఆయన భార్య దామిని బిల్లోరియా 2022 డిసెంబర్ 19న జమ్మూ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు దురంతో ఎక్స్‌ప్రెస్‌లో (రైలు నంబర్ 12266) టికెట్లు బుక్ చేసుకున్నారు.

షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 20న తెల్లవారుజామున 3:55 గంటలకు ఈ రైలు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది.

అదే రోజు ఉదయం 7:15 గంటలకు ఢిల్లీ నుంచి గువాహటికి వెళ్లేందుకు విమాన టికెట్లు కూడా తీసుకున్నారు.

అయితే, అనుకున్న సమయానికి రైలు ఢిల్లీ చేరుకోలేదు. ఏకంగా 3 గంటల 55 నిమిషాలు ఆలస్యంగా ఉదయం 7:50 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది.

అప్పటికే విమానం బయలుదేరే సమయం దాటిపోవడంతో దంపతులు తమ ప్రయాణాన్ని కోల్పోయారు.

వివరాలు 

అసలేం జరిగిందంటే?

తప్పనిసరి పరిస్థితుల్లో రూ.35,699 ఖర్చు చేసి కొత్త విమాన టికెట్లు కొనుగోలు చేయాల్సి వచ్చింది.

అంతేకాకుండా, ఆ రాత్రి ఢిల్లీలోనే హోటల్‌లో ఉండేందుకు మరో రూ.2,500 వెచ్చించారు.

రైలు ఆలస్యం కారణంగా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ దంపతులు న్యాయం కోసం జమ్మూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు.

ADVERTISEMENT

వివరాలు 

రైల్వే వాదనను తోసిపుచ్చిన కమిషన్

ఈ కేసు విచారణ సందర్భంగా రైల్వే శాఖ తన వాదనలను కమిషన్ ముందు ఉంచింది.

నిబంధనల ప్రకారం రైళ్ల ఆలస్యానికి తాము బాధ్యత వహించాల్సిన అవసరం లేదని తెలిపింది.

పొగమంచు వంటి సహజ కారణాల వల్లే రైలు ఆలస్యమైందని పేర్కొంది.

అయితే, కమిషన్ ప్రెసిడెంట్ పవన్ దేవ్ కొత్వాల్, సభ్యురాలు నీలం బాలా భరద్వాజ్‌లతో కూడిన ధర్మాసనం రైల్వే వాదనలను తిరస్కరించింది.

రైలు ఆలస్యానికి గల కారణాలు తమ నియంత్రణకు అతీతమైనవని నిరూపించేందుకు రైల్వే శాఖ తగిన ఆధారాలు సమర్పించలేదని అభిప్రాయపడింది.

అంతేకాకుండా, నిర్ణీత సమయంలో లిఖితపూర్వక సమాధానం దాఖలు చేయడంలోనూ విఫలమైందని పేర్కొంది.

ADVERTISEMENT

vivaralu

రూ.63 వేలకు పైగా పరిహారం చెల్లించాలని ఆదేశం

ఈ కేసులో రైల్వే శాఖ సేవా లోపానికి పాల్పడిందని స్పష్టం చేసిన కమిషన్.. ఈ నెల 4న తుది తీర్పు వెలువరించింది.

దంపతులకు జరిగిన ఆర్థిక నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని రూ.38,199 చెల్లించాలని ఆదేశించింది.

ఈ మొత్తానికి 2023 ఫిబ్రవరి 13 నుంచి ఏడాదికి 7.5 శాతం వడ్డీ కూడా చెల్లించాలని స్పష్టం చేసింది.

ఇవే కాకుండా, దంపతులు ఎదుర్కొన్న మానసిక వేదనకు పరిహారంగా రూ.20,000, కేసు ఖర్చుల కింద మరో రూ.5,000 చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

మొత్తం పరిహారాన్ని ఆరు వారాల్లోగా డిపాజిట్ చేయాలని రైల్వే శాఖను ఆదేశించింది.

ADVERTISEMENT