తదుపరి వార్తా కథనం

Mithun Reddy: మిథున్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చిన పోలీసులు.. లుకౌట్ నోటీసులు జారీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 16, 2025
09:45 am
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనపై లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఆయనకు ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఆయన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు నిన్న తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి దేశం విడిచి వెళ్లిపోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు ప్రయాణించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సిందేనని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.