
MIZORAM : బీజేపీతో పొత్తు ఉండదన్న మిజోరం సీఎం జోరంతంగా.. పూర్తి మెజారిటీ వస్తుందని ధీమా
ఈ వార్తాకథనం ఏంటి
మిజోరం ఎన్నికలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మిజో నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్ జోరంతంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ఫలితాల్లో హంగ్ అసెంబ్లీ రాదని, ఎంఎన్ఎఫ్ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందన్నారు.
ఈ మేరకు తనకు పూర్తి విశ్వాసం ఉందని ప్రకటించారు. అయితే బీజేపీ, రాష్ట్రంలో కూటమి భాగస్వామిగా ఉండదని, కేంద్రంలో మాత్రమే ఎన్డీయేగా ఉంటుందన్నారు.
మిజోరంలో బీజేపీతో లేదా మరే ఇతర పార్టీతో పొత్తు లేదుని, తాము కేంద్రంలోని ఎన్డీయేలో మాత్రమే భాగస్వామ్యమన్నారు. మిజో అవసరాలకు అనుగుణంగా ఎన్‌డీఎకు మద్దతిస్తామని ఆయన చెప్పారు.
మరోవైపు 40 మంది సభ్యులున్న మిజోరం అసెంబ్లీకి ఇవాళ ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న నిర్వహించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మిజోలో పూర్తి స్థాయి ఎంఎన్ఎఫ్ ప్రభుత్వమే వస్తుంది : జోరంతంగా
#WATCH | Mizoram elections | CM and MNF president Zoramthanga says, "It will not be a hung Assembly. It will be MNF Government. I have full confidence in that."
— ANI (@ANI) November 7, 2023
"BJP is not an alliance partner. NDA is there in the Centre. Here in the state, we don't have any alliance with BJP or… pic.twitter.com/BX297Gymin