MLC Kavitha : నెలసరి సెలవుల అంశంలో మహిళల బాధను స్మృతి ఇరానీ విస్మరించారు
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవుల అంశంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అయితే గురువారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, సెలవుల ప్రతిపాదనను వ్యతిరేకించడం నిరుత్సాహానికి గురిచేసిందన్నారు. సాటి మహిళగా అలాంటి వాఖ్యలు చేయడం మంత్రికి సరికాదన్నారు. నెలసరి సమయంలో మహిళలు పడే బాధను గమనించి సెలవు మంజూరు చేయాలని కోరకుండా, సదరు ప్రతిపాదనను కొట్టిపారేయడం విచారం కలిగించిందన్నారు. మహిళల బాధ పట్ల ఇంతటి నిర్లక్ష్యాన్ని చూడాల్సి వస్తున్నందుకు తోటి స్త్రీగా బాధపడుతున్నాన్నారు. నెలసరి మనకున్న ఎంపిక కాదని, అదొక సహజమైన జీవ ప్రక్రియ అన్నారు. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అంటే మహిళల బాధను విస్మరించినట్లేనని అసంతృప్తి వ్యక్తం చేశారు.