Somu Veerraju: నేడు ఎమ్మెల్సీ నామినేషన్.. బీజేపీ నుంచి సోము వీర్రాజుకు అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ సోము వీర్రాజును ఖరారు చేసింది.
బీజేపీ సీనియర్ నేతగా ఉన్న ఆయన నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో, కూటమిలో టీడీపీకి మూడు, జనసేన, బీజేపీకి ఒక్కో సీటు కేటాయించిన విషయం తెలిసిందే.
టీడీపీ తన అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను ఆదివారం ప్రకటించింది. వెనుకబడిన వర్గాలకు ఇద్దరికి, ఎస్సీ సామాజిక వర్గానికి ఒకరికి అవకాశం కల్పిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.
Details
జనసేన తరుపున నాగబాబు నామినేషన్
కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేయగా, తాజాగా బీజేపీ తరఫున సోము వీర్రాజు ఎంపికయ్యారు.
నామినేషన్ల దాఖలుకు నేడు (సోమవారం) చివరి రోజు కావడంతో, టీడీపీ అభ్యర్థులు, సోము వీర్రాజు నామినేషన్ వేయనున్నారు.
ప్రస్తుతం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల మెజారిటీ నేపథ్యంలో, ఈ ఐదు స్థానాలన్నీ కూటమి ఖాతాలోకి వెళ్లే అవకాశముంది.