Mizoram: మిజోరంలో ఉప ఎన్నికలో MNF ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది. మిజోరంలో ఉన్న డంపా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో మిజో నేషనల్ ఫ్రంట్ (Mizo National Front) అభ్యర్థి డాక్టర్ ఆర్. లాల్తంగ్లియానా (Dr. R. Lalthangliana) ఘన విజయం సాధించారు. ఆయన 6,981 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యే లాల్రింట్లుంగా సైలా మరణంతో ఈ స్థానం ఖాళీ కావడంతో నవంబర్ 11న ఉప ఎన్నిక నిర్వహించబడిన విషయం తెలిసిందే.
Details
బిహార్ లో విజయం దిశగా ఏన్డీయే
ఇక బీహార్‌లో రాజకీయ హవా పూర్తిగా ఎన్డీయే వైపు వీస్తోంది. కూటమి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ అయిన 122ను దాటి 191 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. మరోవైపు ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ కేవలం 50 నియోజకవర్గాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. బీహార్ ప్రజలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి భారీ విజయాన్ని అందిస్తున్నట్లు గణాంకాలు స్పష్టంగా సూచిస్తున్నాయి.