NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kolkata: కోల్‌కతా ఆసుపత్రిలో అర్ధరాత్రి చెలరేగిన  హింస.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు 
    తదుపరి వార్తా కథనం
    Kolkata: కోల్‌కతా ఆసుపత్రిలో అర్ధరాత్రి చెలరేగిన  హింస.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు 
    Kolkata: కోల్‌కతా ఆసుపత్రిలో అర్ధరాత్రి చెలరేగిన హింస

    Kolkata: కోల్‌కతా ఆసుపత్రిలో అర్ధరాత్రి చెలరేగిన  హింస.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 15, 2024
    07:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం తర్వాత వార్తల్లో నిలిచింది.

    ఆగస్టు 9న జరిగిన ఈ విషాద ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు, ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

    ఇదిలా ఉండగా గురువారం అర్ధరాత్రి 12.40 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు పెద్దఎత్తున ఆసుపత్రిలోకి ప్రవేశించి ఆస్తులను ధ్వంసం చేశారు.

    కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కు అప్పచెప్పారు.

    దాడి చేసిన వారు ఎమర్జెన్సీ వార్డును కూడా వదిలిపెట్టలేదు. అక్కడ ఉంచిన మందులను కూడా ధ్వంసం చేశారు.

    వివరాలు 

    టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించిన పోలీసులు 

    పలు దిక్కుల నుంచి వచ్చిన జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, టియర్ గ్యాస్ షెల్స్‌ను అడపాదడపా ప్రయోగించినట్లు సమాచారం. పలు పోలీసు వాహనాలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.

    "ఆసుపత్రికి రక్షణగా ఉన్న పలువురు పోలీసులపై ఇటుకలు, రాళ్లతో దాడి చేయడంతో వారు గాయపడ్డారు" అని అజ్ఞాత పరిస్థితిపై ఆ ప్రాంతంలో పోస్ట్ చేసిన ఒక పోలీసు అధికారి తెలిపారు.

    తెల్లవారుజామున 4 గంటల వరకు పోలీసులు ఎంత మంది సిబ్బంది గాయపడ్డారో, ఎంత మందిని అరెస్టు చేశారో చెప్పలేదు.

    సుమారు గంటపాటు జరిగిన ఈ గొడవలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు తెలిపారు.

    వివరాలు 

    ఆర్‌జి కర్ ఆసుపత్రికి  అదనపు బలగాలు 

    కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ మధ్యాహ్నం 1.20 గంటలకు ఆర్‌జి కర్ ఆసుపత్రికి చేరుకున్నారు. అదనపు బలగాలను కూడా రప్పించారు.

    పోలీసు కమీషనర్ ఈ దాడికి సోషల్ మీడియా, ఆన్‌లైన్ వార్తా సంస్థలలోని ఒక విభాగాన్ని నిందించారు. 31 ఏళ్ల డాక్టర్ హత్య గురించి ప్రచారం దాడికి దారితీసిందని అన్నారు.

    గోయల్ మాట్లాడుతూ, "సోషల్ మీడియాలో నిరాధారమైన సమాచారం, తప్పుడు ఆరోపణలు నిరంతరం వ్యాప్తి చెందుతున్నాయి. అందుకే ఈ దాడి జరిగింది. పోలీసు కమీషనర్‌గా ఎవరినీ భయపెట్టే ప్రయత్నం ఏ స్థాయిలోనూ జరగలేదని చెబుతున్నాను. వెంటనే ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. విచారణ కొనసాగుతోంది. పోలీసుల పరువు తీసేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని అన్నారు.

    వివరాలు 

    జూనియర్ డాక్టర్లు  విధుల్లోకి రావాలని కోల్‌కతా హైకోర్టు విజ్ఞప్తి 

    ట్రెయినీ డాక్టర్ పై రేప్, హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం, జస్టిస్ హిరణ్మోయ్ భట్టాచార్య కోల్ కతా పోలీసులను ఆదేశించింది.

    డివిజన్ బెంచ్ రోగుల ప్రయోజనాల కోసం తిరిగి విధుల్లోకి రావాలని ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేసింది.

    బుధవారం సాయంత్రం జరిగిన టీఎంసీ కార్యక్రమంలో హోం, ఆరోగ్య శాఖల ఇన్‌చార్జి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే విధమైన విజ్ఞప్తి చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోల్‌కతా

    తాజా

    ITRFiling: ఐటీఆర్ ఫైలింగ్‌లో ఫారం 16కు సంబంధించి కీలక మార్పులు.. జీతం పొందే ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    Tatkal Tkt Booking: జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లకు కొత్త నిబంధనలు: మోసాల నివారణకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం  రైల్వే శాఖ మంత్రి
    Gold Rate: మళ్లీ రూ.లక్ష మార్క్‌ దాటిన బంగారం ధర  బంగారం
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@25,100 స్టాక్ మార్కెట్

    కోల్‌కతా

    ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం పశ్చిమ బెంగాల్
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్
    పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి పశ్చిమ బెంగాల్
    దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025