Narendra Modi: రాజ్యసభలో మోదీ ప్రసంగం.. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాజ్యసభలో ప్రసంగించారు.
పరాజయానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు అన్య మనస్కంగా ఉన్నారని మోడీ అన్నారు.దేశ ప్రజల నిర్ణయాన్ని ప్రతిపక్షాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా అఖండ సేవాభావంతో ఎన్డీయే ముందుకెళ్తోందని ప్రధాని తెలిపారు.
వివరాలు
రాజ్యాంగాన్నిగురించి ప్రధాని
రాజ్యాంగం వల్లే మనలాంటి వ్యక్తులు ఇక్కడికి చేరుకున్నారని, రాజ్యాంగం మనకు ఆర్టికల్‌ల సమాహారం కాదు, దాని స్పూర్తి కూడా ముఖ్యం అని ప్రధాని అన్నారు.
రాజ్యాంగం ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటామని చెప్పినప్పుడు, రాజ్యాంగ ప్రతిని పట్టుకొని తిరిగేవారు ఈరోజు నిరసన వ్యక్తం చేయడం నాకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.
వివరాలు
ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచిందన్నా మోదీ.. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే మాకు ఈ అవకాశం దిక్కిందన్నారు.
రాజ్యాంగం తమ ప్రభుత్వానికి చాలా పవిత్రమైందన్నారు. ఈ ఎన్నికలో దేశ ప్రజలు చూపిన విశ్వాసం పట్ల గర్వపడుతున్నామని అన్నారు.
పదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం సేవాభావంతో ముందు వెళ్లుతోందని అన్నారు.
వివరాలు
రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్
రాజ్యసభలో మోదీ ప్రసంగం జరుగుతున్న సమయంలో విపక్ష నేతల వాకౌట్ చేశారు.
ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ మాట్లాడుతూ.. 'విపక్ష నేతలు సభను కాదు.. మర్యాదను విడిచి వెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించారు. సభలో ప్రతి సభ్యుడికి అవకాశం ఇస్తున్నాం. కానీ, వారు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారు. రాజ్యాంగంపై హేళనగా ప్రవర్తించడం సమంజసం కాదు. రాజ్యాంగం అనేది చేతిలో పుస్తకం కాదు. జీవితానికి మార్గదర్శకం'' అని విపక్షాలపై మండిపడ్డారు.
వివరాలు
రైతుల సంక్షేమంపై.. ప్రధాని ఏం మాట్లాడారంటే?
రైతుల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు.కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని, పంటలకు కనీస మద్దతు ధర అందిస్తున్నామన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
వివరాలు
కాంగ్రెస్‌పై విమర్శలు..
కాంగ్రెస్‌కు రిమోట్ ప్రభుత్వాన్ని నడపడం అలవాటని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆటో మోడ్ ప్రభుత్వాన్ని కోరుకుంటోందని.. ప్రజాప్రభుత్వాన్ని కోరుకోవడం లేదని దుయ్యబట్టారు. మన త్వరలోనే దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో అన్ని వర్గాలు అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు.
వివరాలు
లంచ్ అవర్ క్యాన్సిల్
రాజ్యసభ నియమాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు భోజన విరామం.. అయితే ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతుండడం, ప్రసంగం పూర్తికాకపోవడంతో ఈరోజు లంచ్ అవర్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించారు.
ఛైర్మన్ తన నిర్ణయం తీసుకోవడానికి ముందు సభ్యుల అభిప్రాయాలను తీసుకున్నారు.
వివరాలు
యువత భవిష్యత్తుతో ఆడుకునే ప్రసక్తే లేదని ప్రధాని అన్నారు
పేపర్ లీక్ పై ప్రధాని తన ప్రసంగంలో స్పందించారు.
పేపర్ లీక్ వంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు ఉండకూడదని అనుకున్నామని, అయితే ప్రతిపక్షాలు రాజకీయాలకు అలవాటుపడ్డారని, యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న వారికి అండగా ఉంటామని భారత యువతకు భరోసా ఇస్తున్నానని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు .