LOADING...
Telangana : హైదరాబాద్‌లో సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ను వర్చువల్ గా ప్రారంభించిన మోదీ
హైదరాబాద్‌లో సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ను వర్చువల్ గా ప్రారంభించిన మోదీ

Telangana : హైదరాబాద్‌లో సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ను వర్చువల్ గా ప్రారంభించిన మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, సాఫ్రాన్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. గత కొన్నేళ్లుగా దేశంలో ఏవియేషన్ రంగం వేగంగా విస్తరిస్తోందని, ఇప్పటికే భారత్ 1,500కి పైగా విమానాలకు ఆర్డర్లు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. విమానాల సేవా కేంద్రం దేశంలోనే స్థాపించబడటం భారత ఏవియేషన్ రంగానికి ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి అనుకూలంగా విధానాలను అమలు చేస్తూ, కొన్ని రంగాల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చినట్లు కూడా వెల్లడించారు.

వివరాలు 

ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి 

సాఫ్రాన్ సంస్థ హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏర్పాటుతో నగర ప్రగతి మరింత వేగం అందుకుంటుందని చెప్పారు. ఏరోస్పేస్, ఏవియేషన్ రంగాల్లో హైదరాబాద్ ఇప్పటికే ప్రధాన కేంద్రంగా నిలుస్తోందని, సంబంధిత రంగాలకు చెందిన అనేక సంస్థలు, నిపుణులు ఇక్కడ పని చేస్తున్నారని వివరించారు. సాఫ్రాన్‌కు ప్రభుత్వం అవసరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.

వివరాలు 

భవిష్యత్తులో ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ ఖర్చు భారీగా తగ్గుతుంది: రామ్మోహన్‌ నాయుడు 

సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ప్రారంభం వల్ల భవిష్యత్తులో విమానాల తయారీ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ లాభం చివరకు ప్రయాణికులకు కూడా చేరుతుందని చెప్పారు. ఇప్పటివరకు విమాన ఇంజిన్ సర్వీసుల కోసం సింగపూర్, మలేసియా వంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చేదని, ఇప్పుడు భారత్‌లోనే ఈ సేవలు అందుబాటులోకి రావడం ఆనందకరమని తెలిపారు. ప్రధాని మోదీ ముందుకు తీసుకొచ్చిన 'ఆత్మనిర్భర్ భారత్' భావంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. హైదరాబాద్ ఏవియేషన్ హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోందని కూడా చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ను ప్రారంభించిన ప్రధాని