PM Modi: జీ-20 వేదికగా మోదీ సరికొత్త డిజిటల్ కూటమి ప్రతిపాదన
ఈ వార్తాకథనం ఏంటి
జీ-20 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలక ప్రతిపాదన చేశారు. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలతో కలిసి ఇబ్సా (IBSA) డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన జోహెన్నస్‌బర్గ్‌లో బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాలతో సమావేశమయ్యారు. ఈ కొత్త డిజిటల్ కూటమిలో భాగంగా యూపీఐ, కోవిన్, సైబర్ సెక్యురిటీ ఫ్రేమ్‌వర్క్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను పరస్పరం పంచుకోవడం కీలక అంశంగా ఉండనుంది. దీనిపై వివరాలను భారత విదేశాంగశాఖ వెల్లడించింది.
Details
ఐరాస భద్రతా మండలిలో మార్పులు తప్పనిసరి
అలాగే ఇబ్సా నిధి (IBSA Fund) గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ నిధుల ద్వారా ఇప్పటికే 40 దేశాల్లో విద్య, ఆరోగ్యం, మహిళల అభివృద్ధి, సౌర శక్తి వంటి రంగాల్లో జరుగుతున్న పనిని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇదే సందర్భంగా మోదీ, ప్రపంచ స్థాయి సంస్థలు ముఖ్యంగా ఐరాస భద్రతా మండలిలో మార్పులు తప్పనిసరి అని ఇబ్సా కూటమి నిరంతరంగా గుర్తుచేస్తోందని పేర్కొన్నారు.