
PM Modi: రష్యా వేడుకలకు హాజరుకాని మోదీ.. భారత కూటమి వైఖరికి సంకేతమా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనను రద్దు చేసినట్టు వెల్లడైంది.
మే నెలలో రష్యా నిర్వహించనున్న విక్టరీ డే వేడుకల్లో ఆయన హాజరు కావడం లేదని క్రెమ్లిన్ ప్రకటించింది.
భారత్-పాకిస్తాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోదీ మాస్కో పర్యటనకు వెళ్లకపోవచ్చని సమాచారం.
రష్యా ప్రతేడాది మే 9న విక్టరీ డే పేరిట వేడుకలు నిర్వహిస్తుంది.
Details
మిత్రదేశాలకు ఆహ్వానం
ఇది రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయం సాధించిన దినోత్సవం. మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో ఈ సందర్భంగా భారీ సైనిక కవాతు నిర్వహించబడుతుంది.
ఈ ఏడాది 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనేక మిత్ర దేశాధినేతలను ఆహ్వానించారు.
ఈ క్రమంలో ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం అందింది. ఇదిలా ఉండగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.