LOADING...
PM Modi: హుగ్లీ తీరంలో మోడీ సందడి.. స్వయంగా ఫొటోలు తీసిన ప్రధాని
హుగ్లీ తీరంలో మోడీ సందడి.. స్వయంగా ఫొటోలు తీసిన ప్రధాని

PM Modi: హుగ్లీ తీరంలో మోడీ సందడి.. స్వయంగా ఫొటోలు తీసిన ప్రధాని

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండో దశలో ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం పలు ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీలు నిర్వహించిన మోడీ, శుక్రవారం కూడా వివిధ ప్రాంతాల్లో ప్రచారం కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం హౌరా నుంచి కోల్‌కత్తా వరకు భారీ రోడ్‌షో నిర్వహించారు. హౌరా బ్రిడ్జిపై ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ కొనసాగించారు. ఇక పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం హుగ్లీ నదిలో బోటు ప్రయాణం చేశారు.

వివరాలు

బోటుపై విహరిస్తూ పరిసర దృశ్యాలు కెమెరాలో చిత్రీకరణ

బోటుపై విహరిస్తూ పరిసర దృశ్యాలను స్వయంగా కెమెరాలో బంధించి, ఆ ఫొటోలను తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తొలి విడతలో భాగంగా గురువారం 152 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఈ దశలో భారీగా ఓటింగ్‌ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 10 శాతం అధికంగా, సుమారు 92.88 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం. ఇక రెండో విడతలో భాగంగా మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న పోలింగ్‌ జరగనుండగా, ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరలవుతున్న వీడియో

Advertisement