Page Loader
Modi Tour In Andhra Pradesh: అమరావతిలో మోదీ పర్యటన.. విజయవాడలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు
అమరావతిలో మోదీ పర్యటన.. విజయవాడలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు

Modi Tour In Andhra Pradesh: అమరావతిలో మోదీ పర్యటన.. విజయవాడలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 30, 2025
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 2, 2025న అమరావతికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో విజయవాడ మీదుగా ప్రయాణించే వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం ప్రకటించింది. మే 2న ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి.

Details

ట్రాఫిక్ మళ్లింపులు - అన్ని రకాల వాహనాలకు (భారీ వాహనాలు సహా) సంబంధించిన మార్గాలు

1. చెన్నై → విశాఖపట్నం / ఇబ్రహీంపట్నం / నందిగామ వైపు చెన్నై నుంచి విశాఖపట్నం లేదా ఇబ్రహీంపట్నం వైపునకు వెళ్లే భారీ వాహనాలను త్రోవగుంట వద్ద నుంచి చీరాల - బాపట్ల - రేపల్లె - అవనిగడ్డ - పామర్రు - గుడివాడ - హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. అదే విధంగా విశాఖపట్నం నుంచి చెన్నైకి వెళ్లే వాహనాలు కూడా ఇదే మార్గంలో ప్రయాణించాలి. 2. చిలకలూరిపేట → విశాఖపట్నం చిలకలూరిపేట నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను NH-16 మీదుగా పెదనందిపాడు - కాకుమాను - పొన్నూరు - చందోలు - చెరుకుపల్లి - భట్టిప్రోలు - పెనుమూడి బ్రిడ్జ్-అవనిగడ్డ-పామర్రు-గుడివాడ - హనుమాన్ జంక్షన్ మార్గంలో మళ్లించారు.

Details

3. చెన్నై → విశాఖపట్నం (బోయపాలెం క్రాస్ మార్గం) 

బోయపాలెం క్రాస్ వద్ద నుంచి ఉన్నవ గ్రామం - ఏ.బి.పాలెం - వల్లూరు - పాండ్రపాడు - పొన్నూరు - చందోలు - చెరుకుపల్లి - భట్టిప్రోలు - పెనుమూడి బ్రిడ్జ్ - అవనిగడ్డ - పామర్రు - గుడివాడ - హనుమాన్ జంక్షన్ మార్గంలో మళ్లింపు జరగుతుంది. 4. గుంటూరు → విశాఖపట్నం గుంటూరు నుంచి బయలుదేరే వాహనాలను బుడంపాడు క్రాస్ - తెనాలి - వేమూరు - కొల్లూరు - వెల్లటూరు జంక్షన్ - పెనుమూడి బ్రిడ్జ్ - అవనిగడ్డ - పామర్రు - గుడివాడ - హనుమాన్ జంక్షన్ మార్గంలో మళ్లిస్తున్నారు.

Details

5. గన్నవరం → హైదరాబాద్

గన్నవరం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఆగిరిపల్లి - శోభనాపురం - గణపవరం - మైలవరం - జి.కొండూరు - ఇబ్రహీంపట్నం మార్గంలో దారి మళ్లించారు. 6. విశాఖపట్నం ↔ హైదరాబాద్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ - నూజివీడు - మైలవరం - జి.కొండూరు - ఇబ్రహీంపట్నం మార్గంలో ప్రయాణించాలి. అదే విధంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వచ్చే వాహనాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలి.

Details

మల్టీ-యాక్సిల్ గూడ్స్ వాహనాలకు ప్రత్యేక ఆదేశాలు 

చెన్నై → విశాఖపట్నం : చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేయబడవు. ఈ మార్గంలో నిరోధాలు లేవు. - విశాఖపట్నం → చెన్నై: హనుమాన్ జంక్షన్, పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ఈ వాహనాలను నిలిపివేస్తారు. రాత్రి 9:00 గంటల తర్వాత మాత్రమే వీటికి రవాణా అనుమతి ఉంటుంది. ప్రయాణికులకు సూచన ఈ మార్గాల్లో ట్రాఫిక్ రహితంగా వాహనాలు కదలికకు సహకరించేందుకు ప్రజలు సహకరించాలని ఏపీ డీజీపీ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. మీరు ఈ మార్గాల్లో ప్రయాణించాలనుకుంటే ముందుగానే మీ రూట్ ప్లాన్ చేసుకోవడం మంచిది.