Page Loader
Naval Ships:భారత నేవీకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు.. జాతికి అంకిత చేయనున్న మోదీ
భారత నేవీకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు.. జాతికి అంకిత చేయనున్న మోదీ

Naval Ships:భారత నేవీకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు.. జాతికి అంకిత చేయనున్న మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 14, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు భారతదేశం కోసం అత్యాధునిక యుద్ధ నౌకలు, జలాంతర్గామి, ఐఎన్‌ఎస్‌ సూరత్‌, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌లను జాతికి అంకితం చేయనున్నారు. ముంబైలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా భారత నేవీ బలం మరింత పెరిగేఅవకాశం ఉంది. ఆయుధతయారీలో ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలని, భారత్ సాధించిన ఈ ముందడుగు చాలా ముఖ్యమని అధికారులు చెప్పారు. ఐఎన్‌ఎస్‌ సూరత్ పీ15బీ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న నాలుగో యుద్ధనౌక. ప్రపంచంలోనే అత్యాధునిక, భారీ డిస్ట్రాయర్‌ యుద్ధనౌకల్లో ఇది ఒకటి. ఈ యుద్ధనౌకలో స్వదేశీ భాగస్వామ్యం 75శాతం ఉంటుంది. ఇందులో అధునాతన ఆయుధ, సెన్సర్‌ వ్యవస్థలు, నెట్‌వర్క్‌ సెంట్రిక్‌ సామర్థ్యం ఉంటాయి.

Details

 ఐఎన్‌ఎస్‌ నీలగిరి 

పీ17ఏ స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన మొదటి యుద్ధనౌక. శత్రువును మాయచేసే స్టెల్త్‌ టెక్నాలజీతో రూపొందించారు. ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్ పీ75 ప్రాజెక్టు కింద తయారు చేసిన ఆరో, చివరి జలాంతర్గామి. ఇది ఫ్రాన్స్‌తో కలిసి అభివృద్ధి చేశారు.