Mohan Babu : సుప్రీం కోర్టులో మోహన్ బాబా బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
మంచు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ వివాదంలో జర్నలిస్టుపై దాడి చేయడంతో రచ్చకు కూడా దారి తీసింది. ఈ ఘటనపై మోహన్ బాబుపై కేసు నమోదైన నేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే హైకోర్టు ఆయనకు నిరాశను మిగిల్చింది. అనంతరం మోహన్ బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
Details
విచారణ వచ్చే గురువారానికి వాయిదా
మోహన్ బాబా తన పిటిషన్‌లో 78 ఏళ్ల వయస్సు, గుండె ఇతర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను స్వీకరించి విచారించింది. కానీ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబా తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు.
దీనిపై సుప్రీం కోర్టు నేడు విచారణ వాయిదా వేసింది.
ఈ కేసు తదుపరి విచారణ వచ్చే గురువారం జరుగుతుందని సుప్రీం కోర్టు వెల్లడించింది.