తదుపరి వార్తా కథనం
iBomma: ఐ-బొమ్మ కేసులోకి ఈడీ ఎంట్రీ..ఇమ్మడి రవి లావాదేవీలపై క్లోజ్ వాచ్
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 18, 2025
05:28 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐ-బొమ్మ (ibomma)వ్యవహారంలో నిందితుడిగా ఉన్న ఇమ్మడి రవి అంశంపై ఈడీ దృష్టి సారించింది. దీనికి సంబంధించి కేసు వివరాలను అందించాలని హైదరాబాద్ సీపీకి ఈడీ అధికారిక లేఖ పంపింది. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిన అవకాశాలను ఈడీ పరిశీలిస్తోంది.ఇప్పటికే ఇమ్మడి రవికి చెందిన బ్యాంక్ ఖాతాల నుంచి సుమారు రూ.3.5కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన ప్రకటనల ద్వారా రవికి డబ్బులు చేరినట్లు బయటపడింది. అంతేకాక, ఒక క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్నారై ఖాతాకు ప్రతి నెలా రూ.15లక్షలు జమ అవుతున్నట్టు దర్యాప్తులో గుర్తించారు. ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని,నిందితుడి బ్యాంక్ లావాదేవీలపై ఈడీ మరింత లోతైన పరిశీలన చేపట్టాలని సిద్ధమవుతోంది.