Monsoon Rain: వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే కేరళకు చేరుకున్న రుతుపవనాలు
అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకయి.ఇవాళ ( 30 మే) రుతుపవనాలు ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలకు చేరుకున్నాయి. మే 31 నాటికి రుతుపవనాలు చేరుకుంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది, అయితే రుతుపవనాలు ఒక రోజు ముందుగానే ప్రవేశించాయి. కొట్టాయం,ఎర్నాకులం సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దీంతో రాష్ట్రంలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు మార్గం సుగమమైంది. త్వరలో ఢిల్లీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు రుతుపవనాలు చేరుకోనున్నాయి.
వేడిగాలులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం
జల్లులు, తేలికపాటి వర్షంతో రుతుపవనాలు ఈశాన్య ప్రాంతాలలో ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం, సాధారణంగా కేరళ రాష్ట్రంలో రుతుపవనాలు వచ్చే సాధారణ తేదీ జూన్ 1. అయినప్పటికీ, 3-4 రోజులు ముందు లేదా వెనుక ఉండటం చాలా సాధారణమైనదిగా పరిగణించబడుతుంది. కానీ, వర్షాకాలం ముందుగానే రావడం వల్ల వేడిగాలులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. కేరళ నుండి ఈ రుతుపవనాలు ఈ రోజు ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలకు కదులుతున్నాయి. కొట్టాయం, ఎర్నాకులం సహా కేరళలోని పలు జిల్లాల్లో రుతుపవనాల కారణంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. చాలా రోజులుగా ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట లభించింది.
ఈశాన్య రాష్ట్రాలల్లో వర్షాలు
కేరళలో రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత ఈశాన్య రాష్ట్రాల వైపు వెళ్లాయి. దీని తర్వాత అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. దీని తరువాత, రుతుపవనాలు మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాలకు చేరుకుంటాయి.
రుతుపవనాలు ఏ రాష్ట్రానికి ఎప్పుడు చేరుకుంటాయి?
భారత వాతావరణ శాఖ విడుదల చేసిన అప్డేట్ ప్రకారం, రుతుపవనాలు జూన్ 20న ఉత్తరప్రదేశ్‌లోకి, జూన్ 30న ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉంది. జూన్ 1న కేరళతో పాటు తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. జూన్ 5న కర్ణాటక, అస్సాం, ఆంధ్రప్రదేశ్‌లకు రుతుపవనాలు చేరుకోనున్నాయి. జూన్ 10న మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ను తాకనుంది. జూన్ 15న గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో రుతుపవనాల వర్షాలు కురుస్తాయి. జూన్ 20న ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉంది. జూన్ 25న గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్‌లకు చేరుకుంటుంది. జూన్ 30న ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో రుతుపవనాల వర్షాలు ప్రారంభం కానున్నాయి.