LOADING...
Rayalaseema Diamonds : వర్షాలతో రాయలసీమలో మళ్లీ జోరుగా వజ్రాల వేట
వర్షాలతో రాయలసీమలో మళ్లీ జోరుగా వజ్రాల వేట

Rayalaseema Diamonds : వర్షాలతో రాయలసీమలో మళ్లీ జోరుగా వజ్రాల వేట

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2025
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాయలసీమ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలు కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజల అదృష్టాన్ని పరీక్షిస్తున్నాయి. ఖరీఫ్ సాగుతో పాటు ఇక్కడ వజ్రాల వేట కూడా జోరుగా సాగుతోంది. జొన్నగిరి, తుగ్గలి, పెరవలి మండలాల్లో విలువైన రాళ్లు దొరుకుతాయన్న ప్రచారం ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుండి ఉంది. భూమి తడిసిన సమయంలో ఈ రాళ్లు బయటకు వస్తాయన్న నమ్మకంతో, స్థానికులు, వ్యాపారులు, ఇతర ప్రాంతాల ప్రజలు వజ్రాల కోసం తరలివస్తున్నారు.

వివరాలు 

వజ్రాల వేట- కోటీశ్వరుల కథలు!

"ఒక రాయి దొరికినప్పటికీ మీ అదృష్టం మార్చవచ్చు" అని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త భరత్ పలోద్ పేర్కొన్నారు. స్థానికుల కథల ప్రకారం,సాధారణ రైతులు కూడా కోటీశ్వరులైన సందర్భాలు ఈ ప్రాంతంలో చాలామందికి స్ఫూర్తినిచ్చాయి. భరత్ పలోద్ 2018లో తన తొలి వజ్రాన్ని కనుగొన్నారు.ఈ ఏడాది మరొక వజ్రాన్ని రూ. 8 లక్షలకు అమ్మినట్లు తెలిపారు. సామాజిక కార్యకర్త దీపికా దుసకంటి గతంలో రూ. 5 లక్షల విలువైన వజ్రాన్ని అమ్మి,ఆ డబ్బుతో పేద పిల్లల చదువుకు సహాయం చేసిన ఘటనలను గుర్తు చేసుకున్నారు. "ఈసారి రూ. 10 లక్షల విలువైన వజ్రం దొరికింది. దీన్ని కూడా విద్యార్థుల కోసం ఉపయోగిస్తాను," అని ఆమె చెప్పారు.

వివరాలు 

వజ్రాలపై అధికారులు అభిప్రాయం 

చిత్తూరుకు చెందిన రైతు గోదావరమ్మ, "వజ్రాలు దొరుకుతున్న వీడియోలు చూసి జొన్నగిరికి వచ్చాను. ఆలస్యంగా వచ్చానా, సీతాకడం కొనసాగిస్తాను. ఒక్కటి దొరికినప్పటికీ మా కుటుంబానికి సాయం అవుతుంది," అని తెలిపారు. "కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాల గురించి అనేక కథలు ఉన్నాయి. ప్రజలు పని కోసం వలస వెళ్ళి, వర్షాకాలంలో తిరిగి వచ్చి వజ్రాల వెతుకుబాటులో పాల్గొంటారు. ఇంత పెద్ద మొత్తంలో వజ్రాల వేట జరగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి నేరాలు నమోదు కాలేదు." భూమిని తమదని చెప్పి బయటివారిని అడ్డుకున్న సందర్భాలు ఉన్నప్పటికీ, పెద్దగా గొడవలు లేదా నేరాల సంఘటనలు జరగలేదు" అని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు.

వివరాలు 

సీజన్‌లో పెద్ద వజ్రాల గుర్తింపు 

ఈ సీజన్‌లో చాలా విలువైన వజ్రాలు దొరికినట్లు వార్తలు రావడంతో మరింత ఉత్సాహం పెరిగింది. పెరవలి గ్రామానికి చెందిన కూలీ వెంకటేశ్వర రెడ్డి దొరికిన వజ్రాన్ని స్థానిక వ్యాపారికి రూ.15లక్షలకు అమ్మినట్లు సమాచారం. అనంతపురం జిల్లాలో 40ఎకరాల భూమి కలిగిన పీ బజరంగలాల్,తన భూమి వజ్రాల వేటకు సక్రియంగా అందుబాటులో ఉందని చెప్పారు. ఆ భూమిలో వజ్రాలు దొరికినవారికి తాగునీరు, ఆహారం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. "వజ్రాలు ఇతరుల జీవితాల్లో సంతోషం తెస్తే, నేను పూర్తి మద్దతు ఇస్తాను," అని చెప్పారు. కర్నూలు జిల్లా మద్దికేర మండలానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు రూ. 2 కోట్లు విలువైన అరుదైన వజ్రాన్ని కనుగొన్నారు. అది సిండికేట్‌కు చెందిన వ్యాపారులకు అమ్ముకున్నట్లు వార్తలు వచ్చాయి.

వివరాలు 

వజ్రాల వేట - నిజాయితీ, నమ్మకం, అదృష్టం 

ఈ ఏడాది దొరికిన వజ్రాల్లో ఇది అత్యంత విలువైనది అని అధికారులు తెలిపారు. తుగ్గలి మండలం చింతలకొండ గ్రామానికి చెందిన ప్రసన్న అనే మహిళ తన పొలంలో దున్నుతూ మెరిసే రాయి కనుగొని, దానిని స్థానిక వ్యాపారికి రూ. 13.5 లక్షలకు అమ్మింది. ఈ ఘటన ఆమె కుటుంబానికి మాత్రమే కాక, గ్రామంలోని ప్రజలకు కూడా ఆనందాన్ని కలిగించింది. జొన్నగిరి, పాగిదిరాయి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి వంటి ప్రాంతాల్లో వర్షాకాలంలో వజ్రాల వేట ఎక్కువగా జరుగుతుంది. భారీ వర్షాల కారణంగా భూమిలోని రాళ్లు బయటపడతాయని అని చెబుతారు. అయినప్పటికీ, చాలామంది ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళేవారు. కొన్నిసార్లు దొరికే వజ్రాలు వేలాది మందికి స్ఫూర్తినిస్తాయి.

వివరాలు 

వజ్రాల వేట - నిజాయితీ, నమ్మకం, అదృష్టం 

జోందరు సిండికేట్‌లు వజ్రం నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేసి,తక్కువ ధరకు కొనే ప్రయత్నాలు చేస్తున్నారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిని ఎదుర్కోవడానికి కొంతమంది స్థానికులు ఆన్‌లైన్ వేలం లేదా సోషల్ మీడియాలో తమ వజ్రాలను యాడ్ పెట్టి మెరుగైన ధరలు పొందుతున్నారు. వజ్రాల కోసం ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు రూపొందించలేదు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఉంటే,వజ్రాలకు ఎందుకు ఉండకూడదని కొందరు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ వజ్రాల వేటకు శతాబ్దాల చరిత్ర కలిగింది.

వివరాలు 

వజ్రాల వేట - నిజాయితీ, నమ్మకం, అదృష్టం 

విజయనగర రాజుల ఖజానాలోకి రాయలసీమలో దొరికిన వజ్రాలు వెళ్లాయని జానపద కథలు చెబుతున్నాయి. వజ్రాల వేట కేవలం సంపాదన మాత్రమే కాక, స్థానికుల జీవన శైలిలో ఒక భాగంగా మారింది. వలస వెళ్లిన కుటుంబాలు వర్షం పడగానే తిరిగి వచ్చి అదృష్టాన్ని పరీక్షిస్తారు. అధికారులు దీనిని "వజ్రాల వ్యవసాయం" అని పిలుస్తున్నారు. కఠినమైన భూభాగంలో, అదృష్టం, విశ్వాసం, పట్టుదలపై ఆధారపడి, ఈ వజ్రాల వేట ఈ ప్రాంతంలో ప్రత్యేక సాంప్రదాయం గా కొనసాగుతోంది.