
మస్కిటో కాయిల్ నుంచి విషవాయువు; ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దోమల నివారణకు ఉపయోగించే మస్కిటో కాయిల్ ఆరుగురి ప్రాణాలను తీసింది. దిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో గురువారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మస్కిటో కాయిల్ కారణంగా విడుదలైన విష వాయువును పీల్చడంతో ఊపిరాడక మరణించారు.
రాత్రి సమయంలో కుటుంబ సభ్యులు నిద్రపోయాక ఇంటిలోని పరుపుపై మస్కిటో కాయిల్ పడగా మంటలు చెలరేగాయి. అనంతరం విషపు పొగలు రావడంతో బాధితులు స్పృహ కోల్పోయారు. అనంతరం ఊపిరాడక చనిపోయారు.
శాస్త్రి పార్క్‌లోని మాచి మార్కెట్‌లోని మజర్ వాలా రోడ్‌లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగినట్లు ఉదయం 9 గంటలకు పోలీసులకు సమాచారం అందిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) జాయ్ టిర్కీ తెలిపారు.
దిల్లీ
మరో ముగ్గురు ఆస్పత్రికి తరలింపు
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తొమ్మిది మందిని జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రికి తరలించినట్లు డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు.
ఈ ఘటనలో ఓ మహిళ, ఏడాదిన్నర చిన్నారి సహా ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
15 ఏళ్ల బాలికతో సహా మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారు కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. మరో 22ఏళ్ల వ్యక్తి ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యాడు.