రాజ్యసభ సభ్యుల్లో అత్యధిక ధనవంతులు మన తెలుగోళ్లే
తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్, వైసీసీకి చెందిన సభ్యులు అత్యధిక ఆస్తుల విషయంలో దేశంలోనే టాప్‌గా ఉన్నారు. రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువపై ఏడీఆర్ సంస్థ ఇచ్చిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రాజ్యసభ సభ్యుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఇద్దరు సభ్యులు తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథిరెడ్డి, వైసీసీ ఎంపీ ఆళ్ల అయోద్యరామిరెడ్డిలు రాజ్యసభలో ఇతర సభ్యుల కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారని ఏడీఆర్ సంస్థ స్పష్టం చేసింది. పార్థసారథి రెడ్డి ఆస్తుల విలువ రూ.5300 కోట్లు కాగా, అయోధ్యరామిరెడ్డి ఆస్తుల విలువ రూ.2,577 కోట్ల మేర ఉంది.
రాజ్యసభ సభ్యుల్లో 75 మంది క్రిమినల్ కేసులు
రాజ్యసభలో మొత్తం 225 మంది సభ్యుల ఆస్తుల విలువ రూ.18,210 కోట్లు ఉండగా, అందులో పార్థసారథి రెడ్డి, అయోధ్యరామిరెడ్డిల సంపదే 43.25శాతంగా ఉన్నట్లు తెలిపింది. రూ.1,001 కోట్లతో అమితాబచ్చన్ సతీమణి జయాబచ్చన్ ఉన్నారు. పార్టీల వారీగా పరిశీలిస్తే బీఆర్ఎస్ ఎంపీల ఆస్తుల విలువ రూ.5,596 కోట్లు ఉండగా, వైసీపీ సభ్యుల విలువ రూ.5,561 కోట్లు, బీజేపీ సభ్యుల విలువ 2,579 కోట్లు విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. ఇక మొత్తం 225 మంది రాజ్యసభ సభ్యుల్లో 75 మంది క్రిమినల్ కేసులు ఉండగా, అందులో 41 మందిపై తీవ్రమైన నేర కేసులు ఉన్నాయని ఏడీఆర్ నివేదికలో తేలింది.