చలామణిలో ఎక్కువగా రూ.500 నోట్లు.. ధ్రువీకరించిన ఆర్బీఐ రిపోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
రూ.2వేల నోట్లతో పోలిస్తే రూ.500 డినామినేషన్ కు చెందిన నకిలీ నోట్లే ఎక్కువగా చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.
చలామణిలో ఉన్న కరెన్నీ నోట్ల విలువ 2022-23 లో 7.8శాతం పెరిగిందని ఆర్బీబీ మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది.
నోట్ల సంఖ్య కూడా 4.4శాతం పెరిగినట్లు ధ్రువీకరించింది. ప్రస్తుత చలామణిలో ఉన్న కరెన్నీ నోట్ల విలువలో రూ.500, రూ.2000 నోట్ల విలువే 87.9శాతమని ఆర్బీఐ తెలిపింది. 2021-21 లో ఇది 87.1శాతం మాత్రంగానే ఉన్నట్లు పేర్కొంది.
ఇటీవల కేంద్రం 2వేల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. వాటిని మార్చుకోవడానికి కేంద్రం సెప్టెంబర్ 30వరకు గడువునిచ్చింది.
Details
14.4శాతం నకిలీ నోట్లను గుర్తించిన ఆర్బీఐ
2022-23 సీజన్ లో రూ.500 డినామినేషన్ కుచెందిన 14.4శాతం నకిలీ నోట్లను ఆర్బీఐ గుర్తించింది. గతేడాది రూ.500 కు చెందిన 91,110 నోట్లను గుర్తించినట్లు ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
అదే ఏడాది రూ.2000 నోట్లలో కేవలం 9806 పీసులు మాత్రమే నకిలీవి వెళ్లినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. 2023 మార్చి 31 నాటికి రూ.500 నోట్లే చలామణిలో ఎక్కువగా ఉన్నాయి.
నోట్ల ముద్రణ కోసం 2022- 23లో కేంద్రం రూ.4,682.80 కోట్లు ఖర్చు చేసింది. గతేడాది ఈ విలువ రూ.4,984.80 కోట్లుగా ఉంది.
ప్రస్తుతం రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 విలువ చేసే నోట్లు చలామణిలో ఉన్నాయి.