రూ.2000నోట్లను ఆర్‌బీఐ రద్దు చేయడానికి కారణాలు ఇవే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్ బి ఐ) శుక్రవారం రూ.2,000 కరెన్సీ నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్యను మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ సమర్ధించారు. రూ.2వేల నోట్లను ఉపసంహరించుకోవడం ఎందుకు ప్రయోజనకరమో కృష్ణమూర్తి సుబ్రమణియన్ 6 కారణాలను చెప్పారు. 2018 నుంచి 2021 వరకు ప్రధాన ఆర్థిక సలహాదారుగా డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ పని చేశారు. 2016 నవంబర్‌లో పాత రూ.500, రూ.1,000 నోట్లను నిషేధించినప్పుడు ఆర్ బీఐ రూ.2,000 నోట్లను ప్రవశపెట్టింది.
కృష్ణమూర్తి సుబ్రమణియన్ చెప్పిన 6 కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం
1.అనేక దాడుల్లో ప్రధానంగా డబ్బును నిల్వ చేయడానికి రూ.2వేల నోట్లను ఉపయోగిస్తున్నట్లు తేలింది. నగదను నిల్వ చేస్తున్న వారిలో 20శాతం మంది 2000 నోట్లను ఉపయోగిస్తున్నట్లు సుబ్రమణియన్ చెప్పారు. వీటి విలువ దాదాపు రూ.3లక్షల కోట్లుగా ఆయన చెప్పారు. 2.రూ.2,000 నోట్లు భారీ సంఖ్యలో ఉపయోగించబడనందున ఈ చర్య సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగదు. 3. డిజిటల్ చెల్లింపులు భారీ సంఖ్యలో ఉపయోగించబడుతున్నందున కరెన్సీ పాత్ర, ముఖ్యంగా రూ.2,000 నోట్ల పాత్ర తగ్గింది. 4.రూ.500నోట్లతో రూ.2వేల నోట్లను మార్పిడిని సులభంగా చేసుకోవచ్చు.
2026 వరకు డిజిటల్ లావాదేవీలు 3 రెట్లు పెరిగే అవకాశం
5. 2026 వరకు డిజిటల్ లావాదేవీలు 3 రెట్లు పెరుగుతాయని బీసీజీ నివేదిక అంచనా వేసింది. దీంతో రాబోయే రూ.2000 నోటు అవసరం మరింత తగ్గుతుందని అని సుబ్రమణియన్ చెప్పారు. 6. 30సెప్టెంబర్ వరకు రూ.2000 నోటు చట్టబద్ధంగా కొనసాగుతుందని ఆర్‌బీఐ చెప్పినా, ఆ తర్వాత వాడకంలో ఉండదని స్పష్టత ఇవ్వలేదు. రూ. 2000 నోట్లను కలిగి ఉన్న వారు 30సెప్టెంబర్-2023 తర్వాత కూడా మారకం చేయడానికి ఆర్ బీఐ అనుమతిచ్చే అవకాశం ఉందని సుబ్రమణియన్ చెప్పారు.