తదుపరి వార్తా కథనం

ఢిల్లీలో 'మోస్ట్ వాంటెడ్' ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అనుమానితుడిని అరెస్టు
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 02, 2023
11:10 am
ఈ వార్తాకథనం ఏంటి
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాది, మరో ఇద్దరు ఉగ్రవాద అనుమానితులను దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం అరెస్టు చేసింది.
ఐఎస్ఐఎస్ ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీ ఉజ్జమా, ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. అతనిపై రూ.3 లక్షల రివార్డు ఉంది.
దేశంలోని అనేక టెర్రర్ మాడ్యూల్స్‌ను అణిచివేసేందుకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ NIA అధికారులతో కలిసి పనిచేస్తోంది.
వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన షానవాజ్ పూణె ఐసిస్ కేసులో వాంటెడ్‌గా ఉన్నాడు.
అతను ఢిల్లీ నివాసి,పూణే పోలీసుల కస్టడీ నుండి తప్పించుకున్నాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులను రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీ, అబ్దుల్లా ఫయాజ్ షేక్‌లుగా గుర్తించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'మోస్ట్ వాంటెడ్'ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అరెస్టు
Suspected Islamic State terrorist on 'most wanted list arrested in Delhi#Delhi @arvindojha https://t.co/bLi0mbzqU7
— IndiaToday (@IndiaToday) October 2, 2023