20 మందిని గాయపర్చిన మోస్ట్ వాంటెడ్ మంకీ నిర్బంధం.. అటవీశాఖకు రూ.21 వేల రివార్డు
ఈ వార్తాకథనం ఏంటి
మోస్ట్ వాంటెడ్ మంకిగా పేరున్న ఓ కోతిని మధ్యప్రదేశ్ అటవీశాఖకు చెందిన ప్రత్యేక సిబ్బంది ఎట్టకేలకు నిర్బంధించారు.
సుమారు 20 మందికిపైగా తీవ్రంగా దాడి చేసి గాయపర్చిన కోతి పేరిట రూ.21 వేల రివార్డును స్థానిక మున్సిపాలిటీ ప్రకటించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌గఢ్ ప్రాంతంలో ఓ కోతి సమీప గ్రామాల్లోని ఇళ్లపై తిరుగుతూ కనిపించిన వారిపై దాడి చేస్తోంది.
గత 15 రోజుల్లోనే దాదాపుగా 20 మంది ప్రజలు దీని బారిన పడి గాయాలపాలయ్యారు. వీరిలో 8 మంది చిన్నారులు ఉండటం స్థానికులను కలవరపెడుతోంది.
కోతిని పట్టుకోవడానికి ప్రయత్నించిన స్థానిక పురపాలక సిబ్బంది తర్వాత చేతులెత్తేశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ చొరవతో ఉజ్జాయినీ అటవీశాఖకు సమాచారం అందించారు.
DETAILS
మత్తు వీడాక బోనులోనే ఆగ్రహంతో ఊగిపోయిన కోతి
కలెక్టర్ కబురుకు స్పందించిన స్పెషల్ ఆపరేషన్ రెస్క్యూ టీమ్ బుధవారం రాజ్‌గఢ్‌కు చేరుకుంది. ఈ క్రమంలో డ్రోన్ సహాయంతో కోతి జాడను తెలుసుకున్నారు.
అనంతరం దానికి మత్తు మందు సూది ఇచ్చి బోనులో నిర్భంధించారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్, జై భజరంగ్ దళ్ అంటూ హోరెత్తించారు.
అయితే కోతికి మత్తు వీడాక బోనులోనే ఆగ్రహంతో ఊగిపోయింది. సదరు బోను నుంచి విడిపించుకునేందుకు గట్టిగా యత్నించింది.
అయితే జనానికి ప్రమాదకరంగా మారిన సదరు కోతిని దట్టమైన అటవీలో వదిలిపెడతామని రెస్క్యూ సిబ్బంది వెల్లడించారు.
ఈ నేపథ్యంలో మోస్ట్ వాంటెడ్ కోతిపై ఉన్న రూ.21 వేల రివార్డును రెస్క్యూ టీమ్ కే అందిస్తామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.