తదుపరి వార్తా కథనం

Nagarkurnool: నాగర్ కర్నూల్ లో విషాదం.. ఇల్లు కూలి తల్లితోపాటు ముగ్గురు పిల్లలు మృతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 01, 2024
03:23 pm
ఈ వార్తాకథనం ఏంటి
నాగర్ కర్నూల్ జిల్లా వనపట్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలో ఇల్లు కూలడంతో తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు.
వనపట్ల గ్రామానికి చెందిన గొడుగు భాస్కర్, పద్మ దంపతులు ముగ్గురు పిల్లలు వసంత, నిక్కి రోజూలాగే.. ఏడాదిన్నర బాలుడితో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నారు.అయితే ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మట్టి ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది.
కూలిన ఇల్లు నిద్రిస్తున్నవారిపై పడింది.పెద్ద శబ్ధం రావడంతో ఇరుగుపొరుగు వారు గమనించి మట్టిలో కూరుకుపోయిన వారిని బయటకు తీయగా అప్పటికే తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందారు.
భర్త భాస్కర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.