West Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన ఆర్జీకర్ మృతురాలి తల్లి విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్జీకర్ ఆసుపత్రి హత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జూనియర్ వైద్యురాలి తల్లి రత్నాదేవనాథ్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. పానీహట్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన ఆమె,సమీప ప్రత్యర్థి తీర్థాంకర్ ఘోష్ పై 28,836 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ పోరులో రత్నాదేవనాథ్‌కు మొత్తం 87,977 ఓట్లు లభించగా,తీర్థాంకర్ ఘోష్‌కు 59,141 ఓట్లు మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా ఆమెకు సగానికి పైగా ఓట్లు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పానీహట్ నియోజకవర్గం గత రెండు దశాబ్దాలుగా తృణమూల్ కాంగ్రెస్‌కు బలమైన కోటగా కొనసాగుతోంది. 2001, 2011, 2016,2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ నాయకుడు నిర్మల్ ఘోష్ వరుస విజయాలు సాధించారు.
వివరాలు
తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తీర్థాంకర్
ఈసారి కూడా అదే పట్టు కొనసాగుతుందని భావించినప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తీర్థాంకర్‌ను బరిలోకి దింపినా ఫలితం మారలేదు. 2024 ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రి లో జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఈ ఘటనలో తన కూతురిని కోల్పోయిన రత్నాదేవనాథ్, ఎన్నికల ప్రచారంలో ఆ విషాదాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లారు. "ఈరోజు నా కూతురికి జరిగిన అన్యాయం, రేపు మరెవరి కూతురికైనా జరగొచ్చు. ఒక తల్లిగా నా బాధను ప్రజలు అర్థం చేసుకోవాలి" అంటూ ఆమె భావోద్వేగంగా ప్రచారం నిర్వహించారు.