వందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు
ఈ వార్తాకథనం ఏంటి
ముంబై-గోవా మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును శనివారం ఉదయం 11గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
75 కిలోమీటర్ల స్పీడుతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ) నుంచి గోవాలోని మడ్‌గావ్ మధ్య నడిచే ఈ రైలు అత్యంత వేగంగా వెళ్లే ట్రైన్‌గా నిలవనుంది.
ముంబై నుంచి గోవాకు కేవలం 7 గంటల 50 నిమిషాల్లో 586 కి.మీ దూరాన్ని ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు పూర్తి చేయనుంది.
ఈ రైలు దాదర్, థానే, పన్వెల్, ఖేడ్, రత్నగిరి, కంకవ్లీ, థివిమ్‌లో ఏడు చోట్ల ఆగనుంది. ఆలాగే రోహాలో సాంకేతిక హాల్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రయాణికులు ఎక్కడం కానీ, దిగడం కానీ ఉండదు.
రైలు
గోవాకు మొదటి వందేభారత్ రైలు
ముంబై-గోవా రైలు అందుబాటులోకి వస్తే దేశంలో వందేభారత్ ట్రైన్ల సంఖ్య 19కి చేరుకుంటుంది.
గోవాలో ఇది మొదటి వందేభారత్ రైలు అవుతుంది. ముంబైకి నాల్గవది కాగా, మొత్త మహారాష్ట్రలో 5వది అవుతుంది.
ముంబై-గోవా రైలు శుక్రవారం మినహా అన్ని రోజులలో నడుస్తుంది.
ఎనిమిది కోచ్‌లతో నడిచే ఈ రైలు సీఎస్ఎంటీ నుంచి ఉదయం 5.25 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.15 గంటలకు మడ్‌గావ్‌కు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో మడ్గావ్ నుంచి 2.35 గంటలకు బయలుదేరి రాత్రి 10.25 గంటలకు సీఎస్ఎంటీకి చేరుకుంటుంది. ఈ రైలు సెక్షనల్ స్పీడ్ గంటకు 120 కిమీ వరకు ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
గోవా
రెండు నెలల్లోనే 16వందేభారత్ రైళ్లు ప్రారంభం
ముంబై-గోవా మార్గంలో చాలా రద్దీ ఉంటుందని, దీంతో ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేయాల్సి ఉందని రైల్వేశాఖ పేర్కొంది.
అయితే ఏసీతో కూడా ఈ వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే రద్దీ తగ్గడానికి దోహదపడుతుందని అభిప్రాయపడింది.
గోవా ఒక పర్యాటక ప్రదేశం అయితే ముంబై వాణిజ్య కేంద్రంగా ఉందని, కీలకమైన రెండు ప్రాంతాల ప్రత్యేక రైళ్లను నడపాడలన్న డిమాండ్ చాలా ఉందని రైల్వే శాఖ చెప్పుకొచ్చింది.
అయితే ఈ రైలు ద్వారా ఆ డిమాండ్ నెరవేర్చినట్లు అయ్యిందిని పేర్కొంది. ఈ రెండు నెలల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 16రైళ్లను రైల్వే మంత్రిత్వశాఖ ప్రారంభించడం గమనార్హం.