Jaish-e-Mohammed: ముంబయిలో జైషే మహమ్మద్ అనుమానితుడు అరెస్ట్.. ఏటీఎస్ దర్యాప్తు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అధికారులు ముంబైలో ఓ అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. క్యాబ్ బుకింగ్ సేవల సంస్థలో బైక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న మహమ్మద్ హసన్ అబు సర్మాద్ అక్తర్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో తీవ్రవాద భావజాలానికి సంబంధించిన కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ముంబయిలోని మహిమ్ మెట్రో స్టేషన్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితుడికి నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ (JeM)కు చెందిన హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వివరాలు
మోదీ పర్యటన భద్రతా నివేదిక పోస్టు..
పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతోనూ అతడికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు సమాచారం వెల్లడించారు.
మహమ్మద్ హసన్ టెలిగ్రామ్‌లో కొన్ని గ్రూపులను నిర్వహిస్తూ.. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ప్రసంగాలను ఇతరులతో పంచుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ముంబయి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రతా లోపానికి సంబంధించిన నివేదికను కూడా అతడు పలు యాప్‌లలో పోస్టు చేసినట్లు గుర్తించారు.
నిందితుడి మొబైల్ ఫోన్‌లో దేశ వ్యతిరేక కంటెంట్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అతడితో సంబంధాలు కలిగిన ఇతర వ్యక్తుల వివరాలను సేకరించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.