LOADING...
Recite Kalma : కల్మా పఠించలేదని.. ముంబైలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి
కల్మా పఠించలేదని.. ముంబైలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి

Recite Kalma : కల్మా పఠించలేదని.. ముంబైలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 28, 2026
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలో దారుణఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కత్తితో ఇద్దరు భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడటం కలకలం రేపింది. వారి మతం గురించి అడిగి, అనంతరం కల్మా పఠించమని ఒత్తిడి చేశాడు.వారు నిరాకరించడంతో ఆగ్రహానికి లోనై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనతో బాధితులు బెంబేలెత్తిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, నయా నగర్ ప్రాంతానికి చెందిన జైబ్ జుబేర్ అన్సారీ (31) సోమవారం తెల్లవారుజామున ఒక నిర్మాణ స్థలానికి చేరుకున్నాడు. అక్కడ భద్రతా సిబ్బందిగా పని చేస్తున్న రాజ్‌కుమార్ మిశ్రా,సుబ్రతో సేన్‌లను మతం గురించి ప్రశ్నించాడు. అనంతరం కల్మా చెప్పమని కోరాడు. వారు చెప్పకపోవడంతో వెంటనే కత్తి తీసుకుని దాడి చేశాడు.

వివరాలు 

హత్యాయత్నం కేసుతో పాటు వర్గాల మధ్య విద్వేషం రెచ్చగొట్టిన ఆరోపణలపై కేసులు నమోదు

ఈ ఘటనలో ఇద్దరూ గాయపడ్డారు. మిశ్రా స్వయంగా ఆస్పత్రికి వెళ్లగా.. సేన్ మాత్రం స్థానిక వ్యక్తి నయాబ్ షేక్ సాయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. అక్కడ నుంచి ఆస్పత్రికి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించి సీసీటీవీ ఆధారంగా కేవలం 90 నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అతనిపై హత్యాయత్నం కేసుతో పాటు వర్గాల మధ్య విద్వేషం రెచ్చగొట్టిన ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. అనంతరం థానే కోర్టులో హాజరుపరచగా మే 4 వరకు పోలీస్ కస్టడీ విధించింది. ఈ ఘటన వెనుక మరే ఇతర ఉద్దేశాలు ఉన్నాయా? లేదా ఇంకెవరైనా సంబంధం ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వివరాలు 

న్‌లైన్ ద్వారా రసాయన శాస్త్రం బోధిస్తున్న అన్సారీ

ఈ కేసును పోలీసులు,యాంటీ టెర్రర్ స్క్వాడ్ సంయుక్తంగా విచారిస్తున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా అతని నోట్స్‌లో తీవ్రవాద భావజాలానికి సంబంధించిన పదాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అన్సారీ కొంతకాలం అమెరికాలో నివసించినట్లు సమాచారం. అతని కుటుంబ సభ్యులు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ఉద్యోగం లభించక భారత్‌కు తిరిగి వచ్చి మిరా రోడ్ ప్రాంతంలో ఒంటరిగా ఉంటూ ఆన్‌లైన్ ద్వారా రసాయన శాస్త్రం బోధిస్తున్నట్లు తెలిసింది. ఈ సమయంలోనే అతను తీవ్రవాద భావజాలానికి ప్రభావితుడై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని,తప్పుదారి పట్టించే సమాచారాన్నివ్యాప్తి చేయవద్దని అధికారులు సూచించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement