Page Loader
Yogi Adityanath: బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎంను చంపుతాం.. ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం 
బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎంను చంపుతాం.. ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం

Yogi Adityanath: బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎంను చంపుతాం.. ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2024
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై పోలీసులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేయబోతున్నట్లు ఒక బెదిరింపు సందేశం అందుకున్నట్టు సమాచారం. "బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎం యోగిని చంపుతాం" అని సందేశంలో దుండుగులు హెచ్చరించారు. వారు ఆయనను పది రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం సాయంత్రం ఈ మెసేజ్‌ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వచ్చినట్టు తెలుస్తోంది.

వివరాలు 

హిట్‌లిస్ట్‌లో జీశాన్‌ సిద్ధిఖీ  

గత నెలలో, మహారాష్ట్ర ఎన్సీపీ పవార్‌ వర్గం నేత బాబా సిద్ధిఖీని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యులు కాల్చి చంపిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌తో ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్లే చంపామంటూ నిందితులు తెలిపారు. ఆ తరువాత, లారెన్స్‌ గ్యాంగ్‌ నుంచి పలువురికి బెదిరింపులు వచ్చాయి. సిద్ధిఖీ కుమారుడు జీశాన్‌ సిద్ధిఖీ కూడా హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం, ఆయనకు ఇటీవలే బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.