తదుపరి వార్తా కథనం

Mumbai timber market: ముంబై కలప మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 26, 2024
09:53 am
ఈ వార్తాకథనం ఏంటి
ముంబైలోని దో టాకీ ప్రాంతంలోని కలప మార్కెట్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో కాలిపోయిన వ్యక్తి మృతదేహం బయటపడింది.
మంటలను ఆర్పేందుకు మొత్తం 20 అగ్నిమాపక యంత్రాలు పనిచేస్తున్నాయి మరియు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగగా, మూడు గంటల తర్వాత కూడా అదుపులోకి రాలేదు.
మంటలు భవనాన్ని చుట్టుముట్టడంతో, సిలిండర్ల నుండి అనేక పేలుళ్లు కూడా సంభవించాయి. దీని వలన సహాయకచర్యలకు ఇబ్బంది తలెత్తింది.
ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు కాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.