తదుపరి వార్తా కథనం
Tirupati: తిరుపతిలో డిప్యూటీ మేయర్‌గా మునికృష్ణ విజయం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 04, 2025
12:36 pm
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతి నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. టీడీపీ అభ్యర్థి మునికృష్ణ 26 మంది మద్దతుతో డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
వైసీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డికి 21 మంది మద్దతిచ్చారు. సోమవారం జరగాల్సిన ఎన్నిక కోరం లేకపోవడంతో వాయిదా పడగా, నేడు మునికృష్ణను డిప్యూటీ మేయర్‌గా ప్రకటించారు.
తిరుపతి నగరపాలక సంస్థలో మొత్తం 50 కార్పొరేటర్లు ఉండగా, ప్రస్తుతానికి 47 మంది మాత్రమే ఉన్నారు.
తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నమోదయ్యారు.
50 మంది సభ్యులకుగాను 25 మంది హాజరు కావాల్సి ఉన్నా, 22 మందే హాజరు కావడంతో ఎన్నిక వాయిదా పడింది.