NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశ రాజధాని దిల్లీలో ఘోరం.. భార్య, కుమారుడి ముందే భర్త దారుణ హత్య
    తదుపరి వార్తా కథనం
    దేశ రాజధాని దిల్లీలో ఘోరం.. భార్య, కుమారుడి ముందే భర్త దారుణ హత్య
    భార్య, కుమారుడి ముందే దారుణ హత్య

    దేశ రాజధాని దిల్లీలో ఘోరం.. భార్య, కుమారుడి ముందే భర్త దారుణ హత్య

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 17, 2023
    10:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. చిన్న గొడవ కాస్త ముదిరి వ్యక్తిగత ద్వేషంగా మారి ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది.

    అంతేకాకుండా అతని కుటుంబాన్ని ఆస్పత్రి పాలు చేసింది.

    అలీ విహార్‌ ప్రాంతంలో నివాసం ఉండే అర్వింద్‌ మండల్‌ శుక్రవారం సాయంత్రం తన కుమారుడ్ని పాఠశాల నుంచి ఇంటికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సదరు బాలుడిని ఉద్దేశించి దూషించాడు.

    దీంతో అతనిపై అర్వింద్ మండిపడ్డారు. అనంతరం కుమారిడితో కలిసి ఇంటికి వెళ్తుండగా నిందితుడు తన స్నేహితులతో కలిసి అడ్డగించాడు.

    కొంతసేపు వాగ్వాదం తర్వాత స్థానికులు జోక్యం చేసుకోవడంతో మాటల యుద్ధం సద్దుమణిగింది.

    DETAILS

    నిందితులను అరెస్ట్ చేసిన దిల్లీ పోలీసులు

    అర్వింద్‌ మండల్‌ అదే రోజు రాత్రి 9.40 గంటల సమయంలో ఇంటి ముందు నిలబడి ఉన్నారు. గమనించిన నిందితుడు తన స్నేహితులతో కలిసి బైకులపై వచ్చి కత్తులతో 15 సార్లు విచక్షణారహితంగా పొడిచారు.

    ఘర్షణలో భర్తను రక్షించుకునేందుకు వెళ్లిన భార్య రేఖా మండల్‌ను రాడ్డుతో తలపై మోదారు.

    వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సరికే నిందితులు అక్కడ్నుంచి జారుకున్నారు.

    తీవ్ర గాయాలపాలైన అర్వింద్ మండల్, రేఖా మండల్‌ దంపతులను పోలీసులు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అర్వింద్‌ తుదిశ్వాస విడిచారు.

    మరోవైపు రేఖా మండల్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    హత్య

    తాజా

    Banu Mushtaq: 'హార్ట్‌ల్యాంప్‌' కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌'కు ప్రతిష్ఠాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌ కర్ణాటక
    USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య..  అమెరికా
    Mohanlal: మోహన్‌లాల్‌ బర్త్‌డే స్పెషల్.. అయిదుసార్లు నేషనల్ అవార్డు గెలిచిన నటుడు సినిమా
    Airlines Alert: భారీ వర్షం కారణంగా గోవాకు విమానాలు ఆలస్యంగా నడుస్తాయి: ఇండిగో  ఇండిగో

    దిల్లీ

    జీ20 సదస్సు వేళ.. దిల్లీ మెట్రో స్టేషన్ల గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' రాతలు మెట్రో స్టేషన్
    PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం
    దిల్లీ మద్యం స్కామ్‌ను విచారిస్తున్న ఈడీ అధికారిపై సీబీఐ కేసు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    హత్య

    Delhi: సాక్షిని హత్య చేసేందుకు సాహిల్ ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దిల్లీ
    గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు; అవధేష్ రాయ్ హత్య కేసులో శిక్ష ఖరారు  ఉత్తర్‌ప్రదేశ్
    ఫుడ్ బిల్లు విషయంలో పుట్టినరోజు వేడుకల్లో గొడవ; యువకుడిని హత్య చేసిన నలుగురు స్నేహితులు  పుట్టినరోజు
    ముంబై: హాస్టల్ గదిలో శవమై కనిపించిన విద్యార్థిని; రైలు పట్టాల వద్ద నిందితుడి మృతదేహం  ముంబై
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025