Page Loader
Delhi: దిల్లీలో తుపాకీ కాల్పులు.. అమెజాన్‌ మేనేజర్‌ మృతి 
దిల్లీలో తుపాకీ కాల్పులు.. అమెజాన్‌ మేనేజర్‌ మృతి

Delhi: దిల్లీలో తుపాకీ కాల్పులు.. అమెజాన్‌ మేనేజర్‌ మృతి 

వ్రాసిన వారు Stalin
Aug 30, 2023
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో మంగళవారం రాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న హర్‌ప్రీత్ గిల్(36) అక్కడికక్కడే చనిపోయాడు. అతని స్నేహితుడికి గాయాలయ్యాయి. హర్‌ప్రీత్ గిల్ తన స్నేహితుడి గోవింద్‌సింగ్‌‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఐదుగురు వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. గోవింద్‌సింగ్‌తో కలిసి వెళ్తుండగా రెండు బైక్‌లపై వచ్చిన ఐదుగురు దుండగులు కాల్పులు జరిపారు. హర్‌ప్రీత్ తలలోంచి బుల్లెట్ వెళ్లగా అక్కడిక్కడే చనిపోయాడు. గోవింద్ సింగ్ చెవికి బుల్లెట్ గాయమైంది. గోవింద్ సింగ్ ప్రస్తుతం ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారని, వారిని గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిందితుల కోసం పోలీసుల గాలింపు