Page Loader
ఉమేష్ పాల్ హత్య కేసు: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు ఉస్మాన్ మృతి
ఉమేష్ పాల్ హత్య కేసు: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు ఉస్మాన్ మృతి

ఉమేష్ పాల్ హత్య కేసు: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు ఉస్మాన్ మృతి

వ్రాసిన వారు Stalin
Mar 06, 2023
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఉస్మాన్ సోమవారం మరణించారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని కౌంధియారాలో పోలీసులు విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఉస్మాన్ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ సమయంలో తీవ్రంగా గాయపడిన నిందితుడు ఉస్మాన్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని సివిల్ లైన్స్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రికి పంపారు. అక్కడ అతను చికిత్స పొందుతూ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం వైద్యులు అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

ఉత్తర్‌ప్రదేశ్

రెండు రోజుల క్రితం మరో నిందితుడు అర్బాజ్‌ హతం

ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రతి నిందితుడికి 2.5లక్షల నజరానా ఇస్తామని యూపీ పోలీసులు ప్రకటించిన ఒకరోజు తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే ఎఫ్‌ఐఆర్‌లో విజయ్‌కుమార్ పేరు లేకపోవడంతో ప్రయాగ్‌రాజ్ పోలీసులు అతడికి రూ.50,000 బహుమతిని ప్రకటించారు. విచారణ ప్రారంభంలో అతడిని గుర్తించలేకపోవడంతో అతడిపై పారితోషికం తగ్గిందని పోలీసులు వెల్లడించారు. విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి మరికొంత మందితో కలిసి 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన పాల్‌ను వారంరోజుల క్రితం హత్య చేశారు. వారం రోజుల క్రితం ప్రయాగ్‌రాజ్‌లోని నెహ్రూ పార్క్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ కేసులో మరో నిందితుడు అర్బాజ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, జిల్లా పోలీసులు కాల్చిచంపారు.