
Karni Sena chief's murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లో కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని దారుణంగా హత్య కేసులో ఇద్దరు షూటర్లతో సహా మొత్తం ముగ్గురిని హర్యానాలో శనివారం అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు.
దిల్లీ పోలీసులు, రాజస్థాన్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో చండీగఢ్‌లోని ఓ హోటల్‌లో వీరిని అరెస్టు చేశారు.
అరెస్టయిన నిందితులను రోహిత్ రాథోడ్, ఉధమ్ సింగ్, నితిన్ ఫౌజీలుగా గుర్తించారు.
సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు.
మొదట రామ్‌వీర్ జాట్‌ను అరెస్టు చేశారు. షూటర్లు (రోహిత్, నితిన్) గోగమేడిని హత్య చేసిన తర్వాత వారు తప్పించుకోవడానికి రామ్‌వీర్ జాట్ సహకరించినట్లు పోలీసులు అభియోగాలు మోపారు.
హత్య
హత్యకు బాధ్యత వహించిన లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు
గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌లతో సన్నిహితంగా ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ఈ హత్యకు బాధ్యత వహించాడు.
గోగమేడి తన శత్రువులకు సాయం చేస్తున్నాడని, అందుకే హత్య చేసినట్లు రోహిత్ గోదార ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.
గోగమేడి హత్య తర్వాత షూటర్లు రోహిత్ గోదార సన్నిహితుడు వీరేంద్ర చౌహాన్‌తో టచ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరేంద్ర చౌహాన్‌తో పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
తప్పించుకునే సమయంలో షూటర్లు వీరేంద్ర చౌహాన్‌కు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తిచారు.
హత్య జరిగిన తర్వాత నిందితులు రైలులో హిసార్, మనాలికి వెళ్లారు. అనంతరం వారు చండీగఢ్‌కు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. చండీగఢ్‌లో పక్కా సమాచారంతో వారిని పట్టుకున్నట్లు వెల్లడించారు.