Page Loader
Murder in Hyderabad: మర్డర్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టారు

Murder in Hyderabad: మర్డర్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టారు

వ్రాసిన వారు Stalin
Apr 08, 2024
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్​ లో దారుణం చోటుచేసుకుంది. పాత కక్షల కారణంగా ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. హత్య చేసిన యువకులు వీడియో తీసి సామాజిక మాధ్యమం ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. హైదరాబాద్లోని బాచుపల్లి వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో అర్థరాత్రి సిద్ధు అనే వ్యక్తిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి ఆపై తలపై రాయిని మోదీ హత్య చేశారు రక్తంతో ఉన్న కత్తిని పట్టుకుని చూపిస్తూ హత్య చేశామని చెబుతూ వీడియో తీసి దాన్ని ఇన్ స్టా గ్రామ్​ లో పోస్ట్ చేశారు. కాగా,సిద్ధు ప్రగతినగర్ లోని బతుకమ్మకుంట వద్ద ఓ బిల్డింగ్లో తన తల్లి మామతోకలసి ఉంటున్నాడు.

Murder video

తరుణ్​ హత్యలో నిందితుడిగా సిద్దు

గతేడాది దసరా పండుగ రోజు బోరబండలో జరిగిన తరుణ్ హత్య కేసులో సిద్దు ఏ3 నిందితుడిగా ఉన్నాడు. రెండు నెలల క్రితమే జైలు నుంచి సిద్ధు విడుదలయ్యాడు. ఆదివారం రాత్రి 3.30 సమయంలో సిద్దు ఇంటికి ముగ్గురు వ్యక్తులు వెళ్లి తలుపు కొట్టారు. బయటకు వచ్చిన సిద్దుని ముగ్గురూ కలసి పొడిచి తలపై రాయితో మోదారు. దీంతో సిద్దు మృతి చెందాడు. సిద్దుని మర్డర్ చేశామని ఇన్ స్టా గ్రామ్ లో వీడియో పెట్టారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి ప్రజల్ని భయాందోళనకు గురయ్యేలా చేసింది. పోలీసులంటే భయం లేకుండా నేరాలు చేసి ఈ విధంగా వీడియోలు తీస్తుంటే వీరికి చట్టాల పట్ల, వ్యవస్థల పట్ల భయం లేదని అర్థమవుతోందంటున్నారు స్థానికులు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హత్య చేసి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువకులు