Loading...
Prashant Kishor: నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు.. పెగాసస్‌పై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు!
నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు.. పెగాసస్‌పై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు!

Prashant Kishor: నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు.. పెగాసస్‌పై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2026
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది వాస్తవమేనని జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, బిహార్ శాసనసభ్యుడు ప్రశాంత్ కిశోర్ అన్నారు. కొన్నేళ్ల క్రితం పెగాసస్ వివాదం వెలుగులోకి వచ్చిన సమయంలో తన ఫోన్‌పైనా నిఘా ఉన్నట్లు తెలిసిందని వెల్లడించారు. పెగాసస్ నిఘా జాబితాలో నా పేరు కూడా.. ఫోన్ ట్యాపింగ్ కొంతకాలంగా జరుగుతోందని, ఈ విషయం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ''ఫోన్ల ట్యాపింగ్ కొంతకాలంగా జరుగుతోంది. దీనిపై ప్రజలకు అవగాహన ఉండాలి. పెగాసస్ నిఘా పెట్టినవారిలో నా పేరు కూడా ఉన్నట్లు బయటపడిన తర్వాత నా ఫోన్ కూడా ట్యాప్ అయిందనే విషయం తెలిసింది'' అని వివరించారు.

వివరాలు

సీఎం భేటీపై ప్రశాంత్ కిశోర్ ఏమన్నారంటే?

తాను నిత్యం విమర్శించే బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీతో ఇటీవల మర్యాదపూర్వకంగా భేటీ అయిన విషయంపైనా ప్రశాంత్ కిశోర్ స్పందించారు.

ఈ భేటీపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.

సమ్రాట్ చౌధరీతో మర్యాదపూర్వకంగా సమావేశమైనంత మాత్రాన.. ఏడో తరగతి కూడా ఉత్తీర్ణత సాధించలేని వ్యక్తిని పీహెచ్‌డీ చేసిన వ్యక్తిగా పరిగణించినట్లు కాదని వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT