Hyderabad: హైదరాబాద్‌లో మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి.. బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురిపై కేసు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో మయన్మార్‌కు చెందిన మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. బాధితురాలి భర్తతో పాటు మరో ముగ్గురు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై కంచన్‌బాగ్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. మయన్మార్‌కు చెందిన ఓ మహిళకు బంగ్లాదేశ్‌కు చెందిన ఫయజ్‌తో వివాహమైంది. పెళ్లి తర్వాత ఇద్దరూ హైదరాబాద్‌కు వచ్చి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. అయితే మద్యానికి బానిసైన ఫయజ్.. తన స్నేహితులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
భర్త ఫయజ్‌తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు
ఈ క్రమంలోనే ఫయజ్‌తో పాటు మరో ముగ్గురు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఘటనపై బాధితురాలు కంచన్‌బాగ్ పోలీసులను ఆశ్రయించింది.
ఆమె ఫిర్యాదు ఆధారంగా భర్త ఫయజ్‌తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితులంతా బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.