Page Loader
అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే
అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే

అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే

వ్రాసిన వారు Stalin
Mar 02, 2023
06:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికే తన మద్దతని తేల్చి చెప్పారు. గత కొంతకాలంగా వైసీపీలో అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్న కృష్ణ ప్రసాద్‌ తాజగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గురువారం గడప గడపకు కార్యక్రమంలో వసంత పాల్గొన్నారు. అమరావతిని జగన్ నాశనం చేస్తుంటే మౌనంగా ఎలా ఉంటున్నారని స్థానిక టీడీపీ నేత జువ్వా రాంబాబును ప్రశ్నించారు. ఈ సందర్భంగా వసంత స్పదించారు.

జగన్

జగన్ వైజాగ్‌కి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్న వేళ వసంత వ్యాఖ్యలు కలకలం

వ్యక్తిగతంగా తన మద్దతు అమరావతికేనని వసంత కృష్ణ ప్రసాద్‌ చెప్పారు. అది రాజధాని కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ ప్రయోజనాలతో సరిపెట్టుకోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని వివరించారు. మరి మరికొద్ది రోజుల్లో జగన్ వైజాగ్‌కి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్న వేళ ఈ వ్యాఖ్య రావడం చాలా మందిని కలకలం రేపుతోంది. గతంలో వసంత వైసీపీని వీడి టీడీపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పుడు జగన్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే పార్టీ మారే యోచనను విరమించుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు మళ్లీ అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కు సరైన రాజధానిగా కొనసాగించాలని ఆయన తన వ్యక్తిగత ఆసక్తిని వ్యక్తం చేశారు.