Page Loader
దిల్లీ మద్యం కేసు: 'సీబీఐ తర్వాత అరెస్టు చేసేది ఎమ్మెల్సీ కవితనే'
సీబీఐ తర్వాత అరెస్టు చేసేది ఎమ్మెల్సీ కవితనే: బీజేపీ

దిల్లీ మద్యం కేసు: 'సీబీఐ తర్వాత అరెస్టు చేసేది ఎమ్మెల్సీ కవితనే'

వ్రాసిన వారు Stalin
Feb 27, 2023
06:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ మద్యం కుంభకోణంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అంశం తెలుగు రాష్ట్రాలు కూడా చర్చశీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన కొంతర కీలక నేతలు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈ కేసు వ్యవహారాన్ని ఇరు రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సిసోడియా అరెస్ట్‌పై మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి స్పందించారు. తర్వాత టార్గెట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితేనని జోస్యం చెప్పారు. అమె కూడా అరెస్టు కావడం ఖాయమని పేర్కొన్నారు.

కవిత

కాలం చెల్లిన నేతలే బీఆర్ఎస్‌లో చేరుతున్నారు: వివేక్

పంజాబ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం కేసీఆర్ కూతురు కవిత ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.150 కోట్లు అందించినట్లు వివేక్ ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సీఎం కేసీఆర్ భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు పేర్కొన్నారు. తన అక్రమ సంపదను దారి మళ్లించేందుకు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చుకుని జాతీయ రాజకీయాల ఆశయ సాధన కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ, మహారాష్ట్రల్లో బీఆర్‌ఎస్‌లో చేరిన నేతలపై కూడా బీజేపీ నేత వివేక్ స్పందించారు. కాలం చెల్లిన నాయకులు మాత్రమే బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. వారితో ఎటువంటి లాభం లేదన్నారు.