D Srinivas: సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత
వ్రాసిన వారు
Stalin
Feb 27, 2023
01:35 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు, పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఆయన ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. డి. శ్రీనివాస్ అస్వస్థతకు గురైన విషయాన్ని ఆయన కుమారుడు, ఎంపీ అరవింద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి