తదుపరి వార్తా కథనం

La Ganesan: నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 15, 2025
09:28 pm
ఈ వార్తాకథనం ఏంటి
నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం చెన్నైలోని ఒక ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారని రాజ్‌భవన్ అధికారులు తెలిపారు. గణేశన్ మరణ వార్త తమను తీవ్ర విషాదంలో ముంచేసిందని ఉపముఖ్యమంత్రి యన్‌తుంగో పట్టొన్ తెలిపారు.గవర్నర్ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. "నాగాలాండ్ గవర్నర్, గౌరవనీయులు లా గణేశన్ ఇకలేరనే విషయం తెలిసి ఎంతో విచారంగా ఉంది. జీవితమంతా ప్రజల కోసమే అంకితం చేసిన ఆయన విలువలకు కట్టుబడి జీవించారు. ప్రజా శ్రేయస్సు, సంక్షేమం విషయాల్లో ఎప్పుడూ రాజీ పడలేదు" అని ఉపముఖ్యమంత్రి యుతుంగో పట్టొన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.