Nagarjuna Yadav: సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్స్.. గుంటూరులో వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు, నాగార్జున యాదవ్‌ను అదుపులోకి తీసుకుని తమ వెంట తీసుకెళ్లారు. అందిన సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో కేసు నమోదు అయింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణ పోలీసులు గుంటూరుకు వచ్చి ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను ముందుగా కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
వివరాలు
రాజకీయ వర్గాల్లో చర్చ..
అనంతరం అరెస్ట్‌కు సంబంధించిన అధికారిక సమాచారంతో పాటు తమ వివరాలను స్థానిక నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు అందజేస్తామని పేర్కొన్న పోలీసులు, నాగార్జున యాదవ్‌ను తమ అదుపులో తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. ఒక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడిని మరో రాష్ట్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు..
ఇటీవల ఓ టెలివిజన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను "జొమాటో డెలివరీ బాయ్"గా అభివర్ణిస్తూ, ప్రభుత్వ జీవోలను కూడా సరిగా చదవలేరని ఆరోపించారు. అలాగే ఎమ్మెల్యేగా కూడా రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పని చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ధృవీకరించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో..
YSRCP Spokesperson Nagarjuna Yadav Arrested Over Remarks Against Revanth Reddy
— Congress for Telangana (@Congress4TS) July 12, 2026
రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యల కేసులో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను గుంటూరులోని ఆయన… pic.twitter.com/xoBKCWe1FZ